ఇంటి యజమానులకే కాకుండా, అద్దెకు ఉండే వారికి కూడా గృహాజ్యోతి పధకం కింద 200 యూనిట్ల ఫ్రీ కరెంట్ వర్తిస్తుందని తెలంగాణ విద్యుత్ శాఖ అధికారులు ప్రముఖ సోషల్ మీడియా platform ట్విట్టర్ ద్వారా తెలియజేసారు.
తెలంగాణ ప్రభుత్వం గృహ జ్యోతి పధకం ద్వారా ప్రతి ఇంటికి రెండు వందల యూనిట్ల ఫ్రీ కరెంట్ ఇస్తామని చెప్పిన సంగతి అందరికి తెలిసిందే. అయితే అద్దెకున్న వారికి గృహ జ్యోతి ద్వారా ఫ్రీ కరెంట్ వర్తించదని ఓ వ్యక్తి ట్విట్టర్ లో పోస్ట్ చేయడంతో వారికి ఈ పధకం వర్తిస్తుందా లేదా అన్న విషయంపై కొంత గందరగోళం నెలకొంది.
అయితే విద్యుత్ శాఖ అధికారులు దీనికి సమాధానం ఇస్తూ అద్దెకున్న వారికి సైతం గృహ జ్యోతి పధకం వర్తిస్తుందని ట్విట్టర్ ద్వారా తెలియజేసారు. దీంతో అద్దె ఇళ్లలో ఉంటూ గృహ జ్యోతి పధకం కోసం అప్లై చేసుకున్న లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ఇదిలాఉండంగా తెలంగాణ విద్యుత్ శాఖ మంగళవారం నాటి నుండి ఈ పధకానికి అర్హులైన వారి నమోదు ప్రక్రియ ప్రారంభించింది.