ఫెరారీ, లాంబోర్గినీ, BMW, పోర్షే, లాంటి కొన్ని కోట్ల విలువ చేసే 41 luxury కార్లను ముంబై పోలీసులు రీసెంట్ గా సీజ్ చేశారు.
వివరాల్లోకి వెల్తే రేపుబ్లిక్ డే సందర్బంగా ఓ సోషల్ మీడియా కంపెనీ ముకేశ్ అంబానీ ఫామిలీకి చెందిన జియో వరల్డ్ డ్రైవ్ మాల్ నుండి కొత్తగా నిర్మించిన అటల్ సేతు బ్రిడ్జి వరకు, జనవరి 26న సూపర్ కార్లతో ర్యాలీ గా వెళదామని పిలుపు నివ్వడం తో కొంత మంది ఔత్సాహిక వ్యక్తులు లాంబోర్గినీ, పోర్షే, ఫెరారీ ఇంకా ఇతర బ్రాండ్ లకు చెందిన సూపర్ luxury కార్లను జియో మాల్ లో పార్క్ చేశారు.
కానీ సదరు సోషల్ మీడియా కంపెనీ చేసిన తప్పేంటి అంటే సూపర్ కార్ ర్యాలీకి పర్మిషన్ తీసుకోకపోవడం. ఈ కార్ ర్యాలీ గురించి సోషల్ మీడియాలో తెలుసుకున్న ముంబై పోలీసులు, పర్మిషన్ లేకపోవడంతో జియో మాల్ పార్కింగ్ లాట్ లో ఉన్న 41 లగ్జరీ కార్లను సీజ్ చేశారు. అంతేకాదు 188 ఐపీసీ చట్టం కింద ఆ కార్ల యజమానులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇదిలాఉండగా సీజ్ చేసిన కార్లలో అంబానీ ఫామిలీకి చెందిన కార్లు ఒక్కటి కూడా లేకపోవడం గమనార్హం.