- 78ఏళ్ల వ్యక్తి తన భార్య కోసం అరుదైన గిఫ్ట్!
- వైరల్ గా మారిన వీడియో !
- ఇది కదా స్వచ్ఛమైన ప్రేమ అంటున్న నెటిజెన్లు!
ఇంస్టాగ్రామ్ లో ఒక వీడియో ప్రపంచవ్యాప్తంగా అందరి హృదయాలను హత్తుకునేలా చేస్తుంది. ఒక 78 ఏళ్ల పెద్దమనిషి తన భార్య కోసం చేసిన పనికి అందరు వావ్ అంటున్నారు. ఇది కదా ప్రేమ అంటే అని ప్రశంసిస్తున్నారు . వివరాల్లోకి వెళ్తే ఈ వీడియోలో అతను 73 ఏళ్ల భార్య పుట్టినరోజు సందర్భంగా ఓ మొక్కను గిఫ్ట్ గా ఇచ్చి తనను సర్ ప్రైజ్ చేసాడు. ఆ మొక్క పేరు పేరు జపానీస్ చెర్రీ బ్లాసమ్ ట్రీ. ఆ మొక్క గురించి వివరిస్తూ ఇది మన ప్రేమకు చిహ్నం అని, కాలం గడుస్తున్న కొద్దీ ఈ మొక్క మరింత అందంగా పెరుగుతుందని వివరించాడు.
మొదట ఆ వ్యక్తి తన భార్యను ఆ మొక్క వద్దకు తీసుకెళ్లి చూపించాడు. ఇది మన ప్రేమకు చిహ్నం అని చెప్పగానే ఆ మహిళ ఆనందంతో తన భర్తను థాంక్యూ అంటూ కిస్ చేసింది. ఇదంతా వీడియో లో నిక్షిప్తమయ్యింది. ఇప్పుడు ఈ వీడియో ఇంస్టాగ్రామ్ లో వైరల్ గా మారింది. 13 లక్షలకు పైగా వ్యూస్ సాధించింది. 76 వేలకు పైగా లైక్స్ వచ్చాయి.
ఈ వీడియోను చూసిన నెటిజెన్లు తమ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో పంచుకుంటున్నారు. వాళ్ళిద్దరి ప్రేమకు చిహ్నంగా ఆ మొక్క నిలుస్తుందని. ఇలాంటి స్వచ్ఛమైన ప్రేమను ఈ కాలంలో ఎక్కువగా చూడలేమని నెటిజెన్లు అంటున్నారు. ఇక ఈ వీడియో మీరు కూడా చూసేయండి.