ఉత్తర్ ప్రదేశ్ లోని బారాబంకి నగారానికి చెందిన ఓ గ్రామంలో దాదాపు వంద మందికి మాయమాటలు చెప్పి మతమార్పిడి చేస్తున్న ఏడుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
వివరాల్లోకి వెళ్తే దాదాపు 100 మంది మత మార్పిడి కోసం అయోధ్య నుండి దేవ షరీఫ్ ప్రాంతానికి వచ్చారు. నవింత ప్రేయర్ సెంటర్ కు చెందిన పాస్టర్ ఆధ్వర్యంలో ఎక్కువ సంఖ్యలో మతమార్పిడిలు జరుగుతున్నాయన్న సమాచారాన్ని తెలుసుకున్న పోలీసులు స్పాట్ కు చేరుకున్నారు.
పాస్టర్ మరియు అతని సిబ్బంది మనుషులకు డబ్బులు మరియు ఫ్రీగా భోజనాలు పెడతాం అంటూ ఆశ చూపి అయోధ్య నుండి బస్సుల్లో తరలించారు. అయితే అప్పటికే స్పాట్ కి రీచ్ అయిన పోలీసులు చర్చ్ పాస్టర్ డొమినిక్ పింటో తో సహా ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు
బారాబంకి A.S.P చిరంజీవి నాథ్ సిన్హా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సిఉంది.